పెద్దపప్పూరు మండలం ఎంపీడీవో కి సిపిఐ నాయకులు వినత పత్రం
పెద్దపప్పూరు మండలం ఎంపీడీవో కి సిపిఐ నాయకులు వినత పత్రం
జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ పని కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలి, మండలంలోని ప్రతి గ్రామంలోనూ ఉపాధి హామీ పనిని అడిగిన ప్రతి కూలి కూడా కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. పెద్దపప్పూరు మండలం పరిధిలోని గ్రామాలలో ఉపాధి హామీ పనిని కల్పించి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని మండల ఎంపీడీవో ని కోరుతున్నాము, అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని, అదేవిధంగా పెరిగిన నిత్యవసర సరుకుల ధరలను దృష్టిలో పెట్టుకొని రోజుకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని పనిచేస్తున్న ప్రాంతాలలో వారికి నీడ నీరు మెడికల్ కిట్లు అందుబాటులో పెట్టి పని చేస్తున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా నివారించాలని, ఒకవేళ ప్రమాదాలు జరిగితే ఆ కూలీలను ప్రభుత్వమే అన్ని విధాల ఆదుకొని జీవనోపాధి కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ పెద్దపప్పూరు మండల కార్యదర్శి చింతా పురుషోత్తం, సిపిఐ మండల సహాయ కార్యదర్శి తలారి రామకృష్ణ, వ్యవసాయ కార్మికులు గుతికి కృష్ణ, నారాయణస్వామి, షఫీ, రామాంజనేయులు, గుర్రం మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.