ఓబులదేవర చెరువు
ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్:
పుట్టపర్తి చిత్రావతి లో మురుగునీరు కలుషితమవుతోంది
కలెక్టర్ గారు ఆ ప్రాంతాన్ని మీరైనా విజిట్ చేయండిఅనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై ప్రస్తావించిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లో ప్రవహిస్తున్న చిత్రావతి నదిలో పుట్టపర్తి మున్సిపాలిటీమురుగునీరు పూర్తిగా కలుషితమై అనేకమంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వీటికి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు మంగళవారం అనంతపురం లో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో నియోజకవర్గ పలు సమస్యలపై ఎమ్మెల్యే అధికారుల వద్ద ప్రస్తావించారు. సత్యసాయి జిల్లాలో ఉన్న పుట్టపర్తి ప్రధాన నగరంలో గత ఐదేళ్లుగా చిత్రావతి నదిలో మురుగునీరు ప్రవహిస్తున్నప్పటికి కనీసం అధికారులు కానీ పాలకుల గాని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కనీసం ఇప్పుడైనా జిల్లా కలెక్టర్ గారు ఆ ప్రాంతాన్ని వెంటనే విజిట్ చేసి తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా కోరారు. దీనికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ రెండు రోజుల్లో ఆ ప్రాంతాన్ని సందర్శించి తగు నివారణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు
కుక్క కాటు పాము కాటు నుంచి ప్రజల ప్రాణాలు కాపాడండి
పుట్టపర్తి నియోజకవర్గం లో చాలామంది పాముకాటు కుక్కకాటుకు గురై దానికి అవసరం అయ్యే కనీస మందులు లేకపోవడం తో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎమ్మెల్యే వైద్య అధికారుల దృష్టికి తీసుకువచ్చారు తక్షణం జిల్లా కేంద్రాలు తాలూకా కేంద్రాలు ఆయా మండల కేంద్రాలలో యాంటీ రాబిక్స్ వీనం యాంటీ స్నేక్ వీనం మందులను సరిపడే ఎంత నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు దృష్టికి ఆమె తీసుకొచ్చారు
దీనికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ స్పందిస్తూ... తక్షణం ఈ మందులను సరిపడేంత ఆయా ఆరోగ్య ప్రధాన కేంద్రాలలో నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మారుమూల గ్రామాలకు ప్రత్యేక రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండిపుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం నుంచి నేరుగా నార్సింపల్లికి అదేవిధంగా యర్లం పల్లికి వెళ్లేందుకు ప్రజలకు రోడ్డు సౌకర్యం సక్రమంగా లేదని ప్రత్యేక రహదారుల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పంచాయతీరాజ్ అధికారులను కోరారు ఇవి ఏర్పాటైతే మండల కేంద్రాలు సుదూర ప్రాంతం బాగా తగ్గి ప్రజలకు మంచి సౌకర్యం ఉంటుందని ఆమె అధికారులకు వివరించారుఅమగొండపాల్యం నుంచి దిగువ చేర్లోపల్లికి ప్రత్యేక రోడ్డు సౌకర్యం కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందిపుట్టపర్తి మండలంలోని అమగొండ పాలెం నుంచి దిగువచేర్లోపల్లికి నేరుగా ప్రజలు వెళ్లేందుకు ప్రత్యేక రహదారి కల్పించే దిశగా అధికారులు వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ అధికారులను ఎమ్మెల్యే కోరారు దీంతో ఆ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు దీనికి పంచాయతీరాజ్ అధికారులు స్పందిస్తూ వీటికి ప్రతిపాదనలు త్వరలో అందజేస్తామని ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు