నగర్ కాంగ్రెస్ పార్టీ పిళ్లి మురళి టిడిపి తీర్థం _ బొండా ఉమా

నగర్ కాంగ్రెస్ పార్టీ పిళ్లి మురళి టిడిపి తీర్థం _ బొండా ఉమా

 అజిత్ సింగ్ -నగర్ కాంగ్రెస్ పార్టీ పిల్లి మురళి టిడిపిలో చేరిక

విజయవాడ- జన చైతన్య (తమ్మిన గంగాధర్)

సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నగర మాజీ ఉపాధ్యక్షుడు పిల్లి మురళి వందమంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు పెళ్లి మురళికి కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి  ఆహ్వానించారు.

ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈరోజు ఒక్క ఛాన్సు అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను అన్ని కులాలను మతాలను పట్టించుకోకుండా నియంతలవ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తున్నారని చంద్రబాబు నాయుడు  పరిపాలన ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. స్వతంత్రం వచ్చినాక ఇలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు ఎప్పుడూ చూడలేదని ఏం హామీలు నెరవేర్చారని ప్రజల్లోకి తిరుగుతారని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల్లోకి లే అర్హత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని 2014 19 మధ్య కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామని జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని నమ్మి ప్రజలు దారుణంగా మోసపోయారని విమర్శించారు. సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఇచ్చి అభివృద్ధి చేసే శక్తి ఒక చంద్రబాబు నాయుడుకే ఉందని తెలిపారు. దానివల్లే ఈరోజు సమాజంలోని మేధావులు విద్యార్థులు అనేక పార్టీలకి చెందిన వారు ఆలోచించిచంద్రబాబునాయుడు  మద్దతుతెలుపుతున్నారని తెలిపారు.

పిల్లి మురళి మాట్లాడుతూ బీసీల సంక్షేమం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమని తెలుసుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరానని తెలిపారు. త్వరలో సెంట్రల్ నియోజకవర్గంలో ముదిరాజుల ఆత్మీయ సమావేశం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతాము అని తెలిపారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పాలన మళ్లీ రావాలని ఈ రాష్ట్రం దాటిలో పడాలంటే చంద్రబాబు అనుభవం అవసరం అని తెలిపారు.ఈ సమావేశంలో జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, ఘంటా కృష్ణ మోహన్, సింగం వెంకన్న, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.