మృత్తిదేహాన్ని మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారు అంతక్రియలు నిర్వహించారు

యాడికి .యాడికిమండల కేంద్రంలోని హాస్పిటల్ కాలనీలో నివసిస్తున్న పొందే సిద్ధప్ప భార్య సరోజమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. వీరి సాంప్రదాయం ప్రకారం అల్లుళ్ళు అంత్యక్రియల కార్యక్రమం చేయాల్సి ఉండగా ఇద్దరు అల్లుళ్ళు మాత్రమే ఉండడం చేత మరొక ఇద్దరు సహాయం అవసరమయ్యే యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు పొందే సరోజమ్మ అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. అంత్యక్రియల కార్యక్రమానికి ఆమడ దూరం ఉంటున్న బంధువుల కన్నా సమాచారం ఇచ్చిన వెంటనే వచ్చి అంత్యక్రియల కార్యక్రమం పూర్తిచేసిన మీరే మాకు బంధువులని పొందే సిద్ధప్ప మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సెక్రటరీ ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, పల్లా ఆంజనేయులు, కాంతమ్మ, సాయి వరపు నాగరాజు పాల్గొనడం జరిగింది..