ఎండాకాలంలో కాస్త ఆరోగ్య మీద జాగ్రత్త పెడదాం- టి.గంగాధర్
ఎప్పుడూ రాజకీయాలు కాదు.ఈ ఎండా కాలం లో కాస్త ఆరోగ్యం మీద శ్రద్ద పెడదాం
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
ఫ్రండ్స్..లేకపోతే పరిణామాలు తప్పవు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఎండ దెబ్బకు హార్ట్ ఎటాక్ వస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండాకాలం మొదలైన రోజు నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జనాన్ని అల్లాడిస్తున్నాడు. దీంతో వడగాలులు కూడా విపరీతంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు
డాక్టర్లు. ఎండదెబ్బకి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.
హార్ట్ పెషంట్లు, ఆరోగ్యంగా ఉన్న వాళ్లు ప్రతి ఒక్కరు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎండ దెబ్బకు గుండెపోటు.ఎండాకాలంలో వీచే ఈ వడగాలుల వల్ల గుండెకు సంబంధించి వ్యాధులు వస్తాయని గతంలో చాలా స్టడీస్‌లో తేలినట్లు నిపుణులు చెప్తున్నారు. 2015 - 2020 మధ్య చైనాలో సంభవించిన హార్ట్ ఎటాక్ మరణాలకు ఎండ దెబ్బ కారణం అని తేల్చినట్లు డాక్టర్లు చెప్పారు. పెద్ద వయసు వాళ్లు మాత్రమే కాకుండా చిన్న వయసులో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినట్లు స్టడీస్ చెప్తున్నాయి. ఎండ దెబ్బకు, హార్ట్ ఎటాక్‌కు లింక్? ఎండదెబ్బ తగిలితే హార్ట్ ఎటాక్ ఎలా వస్తుందనే అనుమానాలు, దానికి దీనికి లింక్ ఎలా అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్న నేపథ్యంలో రిసెర్చ్ లు ఈ విధంగా చెప్తున్నాయి. శరీరాన్ని ఆయిల్ మెషిన్ తో పోల్చారు డాక్టర్లు. హీట్ వేవ్ టైంలో అది ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే గుండె మాములు కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. రక్త ప్రసరణ కావాలంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా స్కిన్ విషయంలో చమటను బయటికి పంపేందుకు హార్ట్ ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఎండాకాలంలో ఎక్కువగా చమట పట్టడం వల్ల ఫ్లూయిడ్స్ లాస్ అవుతాం. దీంతో రక్తం చిక‌్కబడి.. పంప్ చేయడం కష్టం అవుతుంది. దీనివల్ల హార్ట్ మీద ఒత్తిడి ఎక్కువై సరిగ్గా పనిచేయదు అని చెప్తున్నారు డాక్టర్లు. ఈ ఎక్స్ ట్రా వర్క్ లోడ్ వల్ల హార్ట్ ఎటాక్ రావడం, హార్ట్ ఫెయిల్ అవ్వడం లాంటివి జరుగుతాయట. పెద్దవాళ్లు జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఎండలకు ఏ వయసు వారైనా ఎండ దెబ్బ బారిన పడతారు. అయితే, పెద్దవాళ్లు ముఖ్యం 70 ఏళ్లు పైబడిన వాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు, డయాబెటిస్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇంకా జాగ్రత్త వహించాలని, వాళ్లకి రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. ఎండలో పనిచేసేవాళ్లు, హార్డ్ వర్క్ చేసేవాళ్లు కూడా తగిన జాగ్రత్తలుతీసుకోవాలంటున్నారు. అధికంగా చెమట పట్టడం, వాంతులు, వీక్ నెస్, నీరసం లాంటి లక్షణాలు ఉంటే కచ్చితంగా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలనిసూచిస్తున్నారు. హెల్త్ నిపుణులు.ఎండ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎండదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. గుండెకి సంబంధించి కూడా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలే పెద్ద పెద్ద ప్రమాదాల బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. మరిఏజాగ్రత్తలుతీసుకోవాలంటే? బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దాహం వెయ్యకపోయినా.. తగినన్ని నీళ్లు కచ్చితంగా తాగాలి. ఎలక్ట్రోలైట్ రిచ్ ఫ్లూయిడ్స్ కూడా హెల్ప్ అవుతాయి. ఎండలో ఎక్కువగా తిరగకపోవడం మంచిది. 10 గంటల నుంచి 4 గంటల వరకు ఇండోర్ లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఎండాకాలానికి తగ్గట్లుగా డ్రెస్ చేసుకోవాలి. లైట్ వెయిట్, లైట్ కలర్, కాటన్ డ్రెస్సులు వేసుకుంటే బెటర్. మెడికేషన్ లో ఉన్నవాళ్లు సమ్మర్ కి తగ్గట్లుగా ఎడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. డాక్టర్ ని సంప్రదించి మార్పులు చేసుకుంటే మంచిది. ఇంట్లో వాళ్లు, చుట్టుపక్కల వాళ్లను కూడా గమనిస్తూ ఉండాలి. బయట పనులు చేసుకునేవాళ్ల జాగ్రత్త చూసుకుంటే వాళ్లకు మంచి చేసిన వాళ్లు అవుతాం.
గమనిక పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.