యాడికి లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

యాడికి లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

యాడికి లో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

జనచైతన్య న్యూస్- యాడికి

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో  జిల్లా పరిషత్ పాఠశాలలో తాడిపత్రి డివిజన్ జిపియంవోవో మధుసూదనరాజు జాతీయ అంధత్వనివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సైదన్న ఆదేశాల మేరకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 27 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరం ఉన్నట్లు గుర్తించారు, వారికి త్వరలో ఉచితంగా కంటి అద్దాలు అంద చేస్తామన్నారు, అవసరమైన 20మంది కి కంటి మందులు ఉచితంగా అందచేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఏ నాగన్న, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాద్యాయులు ఇంతియాజ్ భాష, జీ. రామలీల సహకరించారు.