అగాపే ఆశ్రమంలో ఘనంగా మదర్ తెరిసా జయంతి వేడుకలు

అగాపే ఆశ్రమంలో ఘనంగా మదర్ తెరిసా జయంతి వేడుకలు

అగాపే ఆశ్రమంలో ఘనంగా మదర్ తెరిసా జయంతి వేడుకలు

జనచైతన్య న్యూస్-యాడికి 

అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడికి మండలం, కమలపాడు రోడ్డు,రాఘవేంద్ర కాలనీ ఉన్న అగాపే ఆశ్రమంలో సోమవారం మదర్ తెరిసా 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అగాపే ఆశ్రమ వ్యవస్థాపకుడు బత్తుల ప్రసాద్ మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేసి,కేక్ కటింగ్ చేసి అందరికీ స్వీట్లు పంచారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నిస్వార్ధమైన సేవ చేసిన సేవ మూర్తి శాంతి దూత త్యాగశాలి మదర్ తెరిసా అని ఆమె సేవలను కొనియాడారు.ఆమె చేసిన సేవలు వర్ణనాతీతమన్నారు,సేవా భావాన్ని మానవతా దృక్పథాన్ని మనమందరము కూడా కలిగి ఉండాలని నిస్వార్ధమైన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు, ఆశ్రమంలో ఉన్నవారు తదితరులు పాల్గొన్నారు.