మలేరియాను నివారిద్దాం "

మలేరియాను నివారిద్దాం "

" మలేరియాను నివారిద్దాం "

 ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉదృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యాధికారి డాక్టర్ భాను ప్రకాష్ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం ను పురస్కరించుకొని ఈరోజు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణం నందు నిర్వహించిన మలేరియా వ్యాధి అవగాహన కార్యక్రమం నందు ఆయన పాల్గొంటూ ప్రసంగించారు. ఈ సందర్భంగా హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ చిన్న దోమతో పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని, కాలానుగుణంగా వచ్చే వ్యాధులలో మలేరియా అతి ప్రమాదకర, ప్రాణాంతకమైనదని అందరూ అవగాహన ఏర్పరచుకొని అప్రమత్తులై ఉండాలని ఉద్ధాటించారు. నిలువ ఉన్న మురికి, మురుగు నీటిలో లార్వాలుగా ఎదిగి తదుపరి దోమలుగా మారిన ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ప్లాస్మోడియం ఫాల్సి ఫారం రకపు మలేరియా ద్వారా మెదడుకు వ్యాప్తి చెందే సిరిబ్రల్ మలేరియా తో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డాక్టర్ కమల్ రోహిత్ నివారణ మరియు చికిత్స ఈ అంశాలను వివరిస్తూ పరిసరాల పరిశుభ్రత, లార్వాల నిర్మూలన, ఫ్రైడే డ్రై డే పద్ధతిని అందరూ ఆచరించడం, వేపాకు పొగ, దోమతెరలు వాడడం, జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష చేయించుకుని నిర్ధారణ అయితే మూల చికిత్స తీసుకోవడం అత్యవసరమని సూచించారు. తదుపరి ఈ కార్యక్రమంలో భాగంగా మలేరియా వ్యతిరేక నినాదాలతో   వీధుల గుండా ర్యాలీ, కూడలిలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిడ్ లెవెల్  హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు మగ-ఆడ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.