జగ్జీవన్ రావ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కందికుంట వెంకట ప్రసాద్

జన చైతన్య న్యూస్: సత్య సాయి జిల్లా.కదిరి పట్టణం. కందికుంట గారి నివాసం.లో స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, భారతరత్న డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి.కందికుంట వెంకటప్రసాద్ .మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని,దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు.దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసి,ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పి రాజశేఖర్ బాబు, నియోజవర్గ అధ్యక్షులు విశ్వనాథ్, తనకల్లు మండల అధ్యక్షులు చిన్నప్ప, గాండ్లపెంట మండల అధ్యక్షులు గంగాధర్, తలుపుల మండలం అధ్యక్షులు పీ రాజశేఖర్, పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్యదర్శి రామాంజనేయులు, కదిరి రూరల్ ఉపాధ్యక్షులు కదిరప్ప, పట్టణ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కుమార్, ఆంజనేయులు, టైలర్ అంజి, నల్లచెరువు ఎస్సీ సెల్ తిరుపాల్, పార్లమెంటు ఎస్సీ సెల్ కార్యదర్శి రెడ్డప్ప తదితరులు ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు జన చైతన్య.న్యూస్ . పొలిటికల్ బ్యూరో విజయ్ కుమార్