స్విగ్గి ఇన్స్టా మార్ట్ లో ఓల్డ్ స్టాక్ డేట్ అయినవి సరుకులు బిస్కెట్స్సేసేల్స్ తస్మాత్ జాగ్రత్త

స్విగ్గి ఇన్స్టా మార్ట్ లో ఓల్డ్ స్టాక్ డేట్ అయినవి సరుకులు బిస్కెట్స్సేసేల్స్ తస్మాత్ జాగ్రత్త

స్విగ్గి ఇన్స్టా మార్ట్   పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు 

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

స్థానిక విజయవాడలోని అలంకార్ సెంటర్లో ఉన్న స్విగ్గి ఇన్స్టా మార్ట్   ప్రధాన వ్యాపార కేంద్రం నుండి కాలం చెల్లిన  తినుబండారాలను సరఫరా చేస్తున్నట్లు వినియోగదారుల నుండి పలుమార్లు ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి పట్టుకున్నారు. మంగళవారం రాత్రి నిర్వహించిన ఈ తనిఖీలో అధికారులు కాలం చెల్లిన పలు తినుబండారాలను పాల ప్యాకెట్లు, ఐస్ క్రీములు, బిస్కెట్లు, బ్రెడ్లు తదితర ఆహార పదార్థాలను తనిఖీ చేసి భారీ మొత్తంలో సీజ్ చేశారు. అయితే గత నాలుగు నెలల నుంచి ఈ వ్యాపార కేంద్రం ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ సహాయ అధికారి షేక్ గౌస్ మొయిద్దీన్ మాట్లాడుతూ ఇటువంటి ఆన్లైన్ ద్వారా సరఫరా అయ్యే తిరుబండారాలు కాలం చెల్లినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలను ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ గౌస్ మొయిద్దీన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ రమేష్ బాబు నిర్వహించారు.