నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి 

విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

దేవినేని అవినాష్

రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితులు కారణముగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.శనివారం నాడు గుణదల  నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 4వ డివిజన్ కి చెందిన దాసం ఉమామహేశ్వర రాజుకి రూ.7,00,000 19వ డివిజన్ కి చెందిన వరిగొండ సూర్యకళ కి రూ.2,50,000/- 22వ డివిజన్ కి చెందిన  కసిరెడ్డి పేరెడ్డి  రూ.1,30,000 చెక్కుకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంద్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్య శ్రీ పధకం ప్రవేశపెట్టడం జరిగింది అని,ఈ పధకం కింద మన రాష్ట్రంలో నే కాకుండా, పొరుగు రాష్ట్రాలలో కూడా మెరుగైన వైద్యం చేపించుకోడానికి వీలు కల్పించారు అని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ గారు అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని రోగాలకు వారి చికిత్స కు అయిన నగదు మొత్తం హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్జి పెట్టుకొంటే ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు.తూర్పు నియోజకవర్గ పరిధిలో ఈ నాలుగు ఏళ్ల కాలంలోనే కోట్ల  రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పెట్టుకోవాలి అంటే తెలుగుదేశం నాయకులు కి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి అని,కానీ ఇప్పుడు ఎవరికి లంచాలు ఇవ్వకుండా పారదర్శకంగా పధకం అమలు  జరుగుతుంది అని తెలిపారు.    ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ రహేనా నహీద్,4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి,వైసీపీ నాయకులు సొంగా రాజ్ కమల్ పాల్గొన్నారు.