ఉపాదీహమీకార్మికులకు తక్షణమే పెండింగ్ బిల్లులను చెల్లించాలి
ఉపాదీహమీకార్మికులకు తక్షణమే పెండింగ్ బిల్లులను చెల్లించాలి
జనచైతన్య న్యూస్- పెద్దవడుగూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సమితి ఆధ్వర్యంలో పెద్దవడుగూరు మండల తాసిల్దార్ కార్యాలయం దగ్గర ఉపాదీహమీ కూలీల సమస్యల కోసం సీపీఐ అద్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా పెద్దవడుగూరు మండలం సిపిఐ మండల కార్యదర్శి వి వెంకటరాముడు యాదవ్ ,సిపిఐ సీనియర్ నాయకులు నారాయణ మాట్లాడుతూ, పెద్దవడుగూరు మండల వ్యాప్తంగా ఉపాధి కూలీలు పనులు చేసి బిల్లులు రాక పస్తులతో అలమటిస్తున్నారు. గత10 వారాలపైగా పనులు చేసి బిల్లులు రాక ఒకపక్క, వ్యవసాయ పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారు, ప్రభుత్వ యంత్రాగం ఏమాత్రం ఉఫాదీహమీ కూలీలను పట్టించుకోలేదు, ఇప్పటికైనా పనులు చేసిన ఉఫాధీహమీ కూలీలకు తక్షణమే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని పెద్దవడుగూరు మండలం సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నది. వ్యవసాయం చేయడానికి కూడా పెట్టుబడులు ఎక్కువ అవుతున్నందున కూలీల ఖర్చు కూడా ఆధనము అవుతున్నందున ఉపాధి హామీ పనులు వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలి, ఉపాధి కూలీలకు గడ్డపారలు తోపాటు, పనిముట్లను కూడా తక్షణమే అందజేయాలి. మెడికల్ కిట్లు కూడా అందించాలి, ఉఫాధీహమీ పనులు కూడా రైతులకు ఉపయోగ పనులు కూడా కల్పించాలి, డ్రైలాండ్ ఆర్టికల్చర్ ద్వారా పండ్లతోట రైతులకు 10 ఎకరాల వరకు పండ్ల మొక్కలు అందించాలి, సబ్సిడీలను కూడా పునరుద్ధరించాలి, భూమిలేని నిరుపేద లకు ప్రభుత్వము రెండు హెక్టార్ల సాగు భూమిని అందించాలి, కూలీలు వలసలు అపాలి, పని దినాలు 200 రోజులకి పెంచాలి, రోజువారి కూలి 600 రూపాయలకి పెంచాలి, అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దవడుగూరు మండల సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి పోలా రంగస్వామి, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు హుస్సేన్ పీరా, సిపిఐ నాయకులు రంగనాయకులు, వేణుగోపాల్ కిరణ్, నారాయణస్వామి, గుడి మల్లికార్జున రామయ్య, ఉపాదీహమీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.