బిజెపి అధ్యక్షులు పురందేశ్వరి ని మర్యాదపూర్వకంగా కలిసిన తలుపుల గంగాధర్

బిజెపి అధ్యక్షులు పురందేశ్వరి ని మర్యాదపూర్వకంగా కలిసిన తలుపుల గంగాధర్

(విజయవాడ, జన చైతన్య న్యూస్) కదిరి బిజెపి సీనియర్ నాయకులు నూతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి గారిని కలిసి, పుష్పగుచ్చం మరియు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. తలుపుల గంగాధర్ గారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన తెలియజేశారు.