గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి

గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి

గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి

జనచైతన్య న్యూస్- ఓబులదేవర చెరువు 

 సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం  ఓబులదేవర చెరువు మండలంలో గ్రామాల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాలను అభివృద్ధి సాధ్యమని ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారం శ్రీరామ్ భరత్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సున్నంపల్లిలో శనివారం గ్రామ వికాసం పై ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర శ్రీరామ్ భరత్ కుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం చేసే రైతులు రోజురోజుకు తగ్గిపోతున్నారన్నారు. ప్రస్తుతం రైతులు తమ పిల్లలకు ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే ఆలోచనతో ఉన్నారన్నారు, గ్రామాలలో రైతుల పండించే పంటలు అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడడం వలన భూమి నాశనం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, పూర్వం రైతులందరూ ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రియ ఎరువుల ద్వారా ఆహారం పండించే వారిని దానివల్ల పెట్టుబడి తక్కువగా ఉంది,రైతులకు వ్యవసాయంలో నష్టం వచ్చేది కాదని ఆయన సూచించారు. గ్రామాల్లో గోవులు పూర్తిగా కనుమరుగు అవుతున్నాయన్నారు,ఈ కార్యక్రమంలో గ్రామ వికాసం రాష్ట్ర సంయోజకలు తిరుపతయ్య,విభాగ సంయోజక సున్నపల్లి చంద్ర, కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింత కుమార్ రెడ్డి,జిల్లా సంయోజ దేవరాజు,కండ సమయోజక్ సుబ్బరాజు, జిల్లా సంస్కార ప్రముక్ రంగప్ప, ప్రసాద్, రామమోహన్ రెడ్డీ, సురేష్, హరి, ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారఖ్ లక్ష్మణ్ జీ, ప్రతాప్, హర్ష, వీరు ప్రసాద తదితరుల పాల్గొన్నారు.