వైసీపీ,నుండి కాంగ్రెస్ పార్టీలోకి 50 కుటుంబాలు చేరిక*
*వైసీపీ,నుండి కాంగ్రెస్ పార్టీలోకి 50 కుటుంబాలు చేరిక*
*అందరికీ అండగా వుంటా నా వెంట నడవండి*
*మీ బిడ్డగా ఆదరించి ఎమ్మెల్యే గా గెలిపించండి...దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి*
అమడగూరు:- అమడగూరు పంచాయితీలో వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ తగిలింది.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి సమక్షంలో అమడగూరు,ఎ.కొత్తపల్లి గ్రామాల నుండి 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ ని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.వైకాపా నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలోకి చేరిన వారిలో చల్ల శ్రీనివాసులు,డేరంగుల రాము,నాగేంద్ర,మల్లిఖార్జున,డేరంగుల రామాంజులు,రంగరాజు,రమణ,నాగరాజు,యం.రామాంజులు,కుంచపు నరసిహులు,మేకానిక్ శంకర,పలువురు చేరారు.దీంతో వైకాపాకు పెద్ద షాక్ తగిలింది.ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మీకు అందరికీ అండగా నేనుంటాను నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించండని అభ్యర్థించారు.శనివారం మండల కేంద్రంలోని స్థానిక చౌడేశ్వరీ దేవి ఆలయంలో యువకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మొదట చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ఇప్పుడు ఎప్పుడు తాను అండగానే ఉంటానని,ఓటమి తర్వాత పారిపోయే వ్యక్తిని కాదు అని స్పష్టం చేశారు.అంతేకాక త్యాగం మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపిస్తాను అని తెలిపారు.పుట్టపర్తి నియోజకవర్గం ఆరు మండలాలలో పరిశ్రమలు స్థాపించి ప్రజలకు ఉపాది కల్పిస్తామన్నారు.అంతేకాక కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 9 రకాల మ్యాన్ పెస్టో ప్రతి ఒక్కరు అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు.అలాగే వైఎస్ఆర్సీపి టిడిపి ఎమ్మెల్యేలను గత పది సంవత్సరాలుగా చూస్తున్నామని వారు ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.అంతేకాదు అమడగూరు మండల ప్రజలు నిత్యం కరువుతో అల్లాడుతుంటే వారు మాత్రం దందాలు,అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నరన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన పథకాలు అభివృద్ధి పనులు తప్ప వేరే ఏమి కనబడలేదన్నారు.అయితే టిడిపి,వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లు అభివృద్ధి చేయలేన్నాతు.ఏ గ్రామానికి వెల్లిన రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు.ఇకపోతే ఉపాధిహామి పథకం లో కూలీలకు పనులు కల్పించకపోవడంతో వలసలు వెలుతున్నారు.కావున రాబోయే ఎన్నికలలో వైయస్ షర్మిళమ్మ నాయకత్వాన్ని బలపరిచి,రాహుల్ గాంధీని గెలిపించి ప్రధానమంత్రి ని చేయాలని తెలిపారు.కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు.మీ ఓటును కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేసీ గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీనాథ రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ నాయక్,సురేంద్ర రెడ్డి,వాసుదేవ రెడ్డి,సంతోష్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి,రామాంజినేయులు,వేణుగోపాల్,నరసింహమూర్తి,రాము,రాజు,అశోక్,అమర్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.