పల్లె కుటుంబానికి అపూర్వ స్వాగతం పలికిన పూల వర్షం కురిపించిన పుట్టపర్తి ప్రజలు*

**పుట్టపర్తిలో హోరెత్తిన టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల ఎన్నికల ప్రచారం*
*పల్లె కుటుంబానికి అపూర్వ స్వాగతం పలికిన పూల వర్షం కురిపించిన పుట్టపర్తి ప్రజలు*
*ఎన్నికల శంఖారావం లో భాగంగా పుట్టపర్తి మున్సిపాలిటీలోని ఎనుమలపల్లి లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె,పల్లే సింధూర ,పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, జన సేన ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్
*ప్రజల నుంచి పల్లె సింధూర కు అనూహ్య స్పందన*
*భారీగా పాల్గొన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు**
*శ్రీ సత్యసాయి జిల్లా :*
*పుట్టపర్తి :07*
తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి పట్టణం ఎనుములపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది.
పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం ,జన సేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ,మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,ఆయన తనయుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి కి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన డప్పు వాయిద్యాల మధ్య అపూర్వ స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలో నిర్వహించిన పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, మరియు భర్త వెంకట కృష్ణ కిషోర్, మాజీ మంత్రి పల్లె, ఎన్నికల ప్రచారంలో తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున బాణా సంచా పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ దుర్మార్గపు చర్యలతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఈ వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్ల వెనక్కి పోయిందన్నారు.రాష్ట్రంలో వైసీపీ నాయకుల చేసిన అరాచకాలకు ప్రజలు ఎంతో ఓపిక పట్టారనీ అన్నారు. వైసీపీ అరాచకాలకు స్వస్తి పలికే రోజు దగ్గర్లో ఉందన్నారు.
టీడీపీ , జనసేన ,బీజీపీ కూటమి ఏపీ లో అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ మూడు పార్టీల కలయిక ఏపీ అభివృద్ధి కి నాంది కావాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి కూటమి, అధికారంలోకి వచ్చి కేంద్రంలో బీజీపీ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి పథంలో ఏపీ ముందుకు పోవడానికి ఆస్కారం ఉందన్నారు.
*అహంకారే కాదు...
బాగా మాటలకారి ఈ పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే*
పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి అహంకారం ఎక్కువ మాటలెక్కువ అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో అశాంతిగా మార్చిన ఘనుడు ఈ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు.
దుద్దే కుంట శ్రీధర్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తే పుట్టపర్తికి పుట్టగతి లేకుండా చేస్తాడని ప్రజలను హెచ్చరించారు.
నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి అవినీతి ,అరాచకాలు దౌర్జన్యాలు వేదింపులకు పాల్పడిన ఎమ్మెల్యే ను ఎప్పుడు చూడలేదన్నారు.
ప్రజలు ఆలోచన చేసి నీతి నిజాయితీ తో పాలన చేసే మంచి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డినీ గెలిపించుకోవాలని కోరారు.టీడీపీ తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకం పేదలకు ఒక వరం అన్నారు. ప్రజల్లో టీడీపీకి రోజు రోజుకు అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. మే 13 న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకుందామని అన్నారు.
టీడీపీ జన సేన ,బీజీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, భర్త వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,మాట్లాడుతూ పల్లె కుటుంబం ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటుందని. వైసీపీ నాయకుల అరాచకాలకు ఆగడాలకు భయపడకుండా శ్రమించాలని. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే కియా లాంటి అంతర్జాతీయ పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల ఏకైక నాయకుడు చంద్రబాబే అన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాల పూర్తి అవుతున్న రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదని రోడ్లు మరమ్మత్తులు గాని పరిశ్రమలు తీసుకురావడంలో గాని సంపద సృష్టించడంలో కానీ జగన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తీవ్రంగా విఫలమయ్యారని పైర్ అయ్యారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ప్రజలను నమ్మించినట్టేట ముంచారనీ మండిపడ్డారు. నిత్యవసర ధరలు సైతం అమాంతంగా పెంచేసి ప్రజలను మోసపుచ్చారని నిరుద్యోగులకు సైతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. మద్యపాన నిషేధం పూర్తి చేసిన తర్వాతే ఎన్నికల ప్రచారానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి నాసిరకమైన తన సొంత మద్యం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూన్నాడు .ప్రజలకు ఉచితంగా దొరికే ఇసుకను సైతం అమ్ముకుంటూ కోట్ల రూపాయల తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎటువైపు చూసిన వైసీపీ పాలనలో అనేక భూకబ్జాలు, దందాలు, అరాచకాలు, వేధింపులు, దౌర్జన్యాలు, పెంచి పోషించే జగన్ ను గద్దెదింపడమే మన అందరి లక్ష్యమని అందరూ ఈ ఎన్నికల్లో సమిష్టిగా పని చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పల్లె సింధూర రెడ్డి, భర్త వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి, ప్రజలకు పిలుపునిచ్చారు.
*జగన్ రెడ్డిని ఇంటికే పంపడమే పవన్ కళ్యాణ్ టీడీపీ ,బీజీపీతో జత కట్టారు.:*
*జన సేన ఇన్ ఛార్జ్ పత్తి చంద్రశేఖర్*
జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగరం కోసమే టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకున్నారని జనసేన నియోజకవర్గం అధ్యక్షుడు పత్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుందని ఆలోచించే పవన్ కళ్యాణ్ మెట్టు దిగి అన్ని త్యాగాలకు సిద్ధపడి కేంద్రంలో ఉన్న బిజెపిని ఒప్పించారన్నారు. ఎంతో ఉత్సాహం ఉన్న జనసేన సైనికులు అనుభవం కలిగిన టిడిపి కార్యకర్తలు, అపారమైన మేధావీ తనం ఉన్న బీజీపీ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పనిచేసి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథి విజయానికి పాటుపడాలని అయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ,పుట్టపర్తి పట్టణ కన్వీనర్ రామాంజనేయులు , పట్టణ కౌన్సిలర్లు ,మాజీ కౌన్సిలర్ల మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, తెలుగు యువత ఐ టి డి పి, నాయకులు, కార్యకర్తలు మహిళలు నాయకురాలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.