ప్రాచీన కాలం నుండి రైతులకు ఏరువాక పౌర్ణమికి ఒక ప్రతీయేకత ఉంది:-

ప్రాచీన కాలం నుండి రైతులకు ఏరువాక పౌర్ణమికి ఒక ప్రతీయేకత ఉంది:-

ఏరువాక పౌర్ణమి సందర్భంగా కొండకింద తండాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.భారతదేశం వ్యవసాయంలో ఏరువాక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ప్రాచీన కాలం నుండి రైతులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా తమ పంట పొలాల్లో పూజ నిర్వహించి ఆ రోజు నుంచి పంట పొలాల పనులను ప్రారంభించే వారు కానీ గడిచిన కొంతకాలంగా వ్యవసాయంలో యాంత్రికరణ విపరీతంగా పెరిగిపోవడంతో ఈ పద్ధతులు మర్చిపోతున్నారని బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు, పంట పండించే రైతు భూమిని తల్లిగా భావించి పూజ చేయాలని ఇది మర్చిపోవడంతో నేడు పంటలు సరిగా పడటం లేదని ప్రతి రైతు భూమిని ఒక తల్లిగా భావించాలని ఆయన సూచించారు. జిల్లాలో వేరుశనగ పంట ఎక్కువ వేస్తున్నారని పంట మార్పిడిచేయడం ద్వారా పంట దిగుబడి అధికంగా వస్తుందని వారు సూచించారు, వ్యవసాయంలో రసాయన ఎరువుల ప్రాధాన్యత పెరిగిపోవడంతో భూమిలో సారం నశించి పోతుందని భూమి లో ఉన్నటువంటి పోషకాలు నశించిపోయి పంటలు సరిగా పండడం లేదని ఆయన తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు రావాలని , ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిని కాపాడుకొని భూమి సారవంతం చేసి పంటలు పండించాలన్నారు. ఒకప్పుడు రైతు వ్యవసాయం ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలు పండించే వాళ్ళని ,నేడు రైతులు వ్యవసాయం ద్వారా కేవలం ఆదాయం కోసమే పంటలు పండిస్తున్నారని దీనికోసం అధిక రసాయనాలు వాడడం ప్రజల ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ కింద తాండ సర్పంచ్ పార్వతి బాయి,మంగేనాయక్ ,బిజెపి మండల అధ్యక్షుడు మురళీధర్,బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ హనుమంత రెడ్డి,ఆంజనేయులు,రామంజులరెడ్డి,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.