నూతన తహసిల్దార్ బాధ్యతల స్వీకరణ
నూతన తహసిల్దార్ బాధ్యతల స్వీకరణ
జనచైతన్య న్యూస్- యాడికి
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో నూతన తహసిల్దారుగా ప్రతాప్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంతకల్ మండల తహసిల్దారుగా పనిచేసిన ప్రతాప్ రెడ్డి బదిలీపై యాడికి తహసిల్దారు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ సిబ్బంది నూతన తహసిల్దార్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ బాలమ్మ, రిసర్వే తహసీల్దార్ రాజ్ కుమార్, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.