కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడిని చంపేశారు
కారుకు సైడ్ ఇవ్వలేదని యువకుడిని చంపేశారు
జనచైతన్య న్యూస్- ఈపూరుపాలెం
బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో కిరాతకం చీరాల, కారుకు సైడ్ ఇవ్వలేదని 18 ఏళ్ల యువకుడిని కత్తులతో అతికిరాతకంగా పొడిచి, చంపిన సంఘటన మంగళవారం రాత్రి బాపట్ల జిల్లా, ఈపూరుపాలెం, ఆదినారాయణపురం మధ్య చోటుచేసుకుంది. మృతుడి స్నేహితుడు మనోజ్ తెలిపిన వివరాల మేరకు, మనోజ్, సయ్యద్ ఆరిఫ్ (18) ఇద్దరూ స్నేహితులు, మనోజ్ బైక్ పై, సయ్యద్ అరిఫ్ సైకిల్ పై మాట్లాడుకుంటూ చీరాల నుంచి ఈపూరుపాలెం వస్తున్నారు, వెనుక నుంచి వస్తున్న ఓ పెద్ద కారు చీరాల నుంచి బాపట్ల వైపు వెళ్తుంది.అందులో ఐదుగురు యువకులున్నారు, వాళ్ల కారుకు సైడ్ ఇవ్వలేదని, ఆరిఫ్ పై ఘర్షణకు దిగారు.వెంటనే కారులో ఉన్న కత్తులు తీసుకుని ఆరిఫ్ పై విచక్షణారహితం గా పొట్ట, మెడ, గుండెలపై పొడిచారు, తీవ్రంగా గాయపడ్డ ఆరిఫ్ ను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆరిఫ్ మరణించాడు, మృతుడి తండ్రి చీరాలలో వస్త్ర దుకాణ యజమానికి కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సైడ్ ఇవ్వలేదని చంపారా, లేక పక్కా ప్లాన్ తో చంపారా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది, సంఘటనా స్థలాన్ని టూటౌన్ సీఐ సోమశేఖర్ పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో హత్య జరగడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఎది ఏమైనా బాపట్ల జిల్లా చీరాల కేంద్రాల నేరాలకు కేరాఫ్ గా మారిందని చెప్పవచ్చు, ఇప్పటికే వరుస హత్యాలతో చీరాల, ఈపురుపాలెం ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.