పెద్దవడుగూరు లో వర్షం కోసం కప్పల ఊరేగింపు

పెద్దవడుగూరు లో వర్షం కోసం  కప్పల ఊరేగింపు

జన చైతన్య న్యూస్ తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో వర్షం కోసం గ్రామస్తులు వినూత్న పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలో కప్పలను ఒక కుండలో వేసుకొని ఊరేగింపు కార్యక్రమం చేశారు. ఇంటింటికి వెళ్లి తిరుగుతూ బిందెలతో నీళ్ళు పోస్తూ వాన కురవాలి వాన దేవుడా అంటూ పాటలు పాడుతూ ప్రార్థించారు. అనంతరం పెద్ద వంకలో గంగమ్మ పూజ చేసి కప్పలను వదిలేశారు.