ఎన్నికలవేళ ప్రశాంతంగా ఉండండి సీఐ రోషన్

ఎన్నికలవేళ ప్రశాంతంగా ఉండండి సీఐ రోషన్

ఎన్నికల వేళ... ప్రశాంతంగా ఉండండి పెద్దవడుగూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్

ఎన్నికల వేళ ప్రశాంతంగా ఉండాలని పెద్దవడగూరు సి.ఐ రోషన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS గారి ఆదేశాల మేరకు సమస్యాత్మక గ్రామాలైన పెద్దవడగూరు మండలం మిడతూరు, కాశేపల్లి, పెద్దవడగూరులలో సి.ఐ రోషన్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కేంద్ర సాయుధ బలగాలచే గ్రామంలో ప్రధాన రహదారులు, కాలనీలలో కవాతు చేపట్టారు. ఎన్నికల వేళ ప్రజల్లో భరోసా కల్పించారు. గ్రామసభ నిర్వహించి గ్రామస్తులతో సి.ఐ ముఖాముఖిగా మాట్లాడారు. స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తాం నిర్భయంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేళ గొడవలు, అల్లర్ల జోలికెళ్లకుండా ప్రశాంతంగా మెలగాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసుశాఖతో సహకరించాలని కోరారు.