వాలంటర్స్ స్వచ్ఛందంగా రాజీనామా
*వాలంటీర్స్ స్వచ్ఛంద రాజీనామా*
ఓ డి సి 2 సచివాలయంలో వాలంటీర్స్ లో పనిచేస్తున్న యు రమేష్ బాబు, కే బాబా ఫక్రుద్దీన్, కే గంగాద్రి , ఎం చంద్ర శేఖర్,స్వచ్ఛందంగా రాజీనామా పత్రాన్ని గురువారం ఎంపీడీవో వరలక్ష్మికి అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు నిస్వార్ధంగా ఇంటి వద్దకు అందజేసి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు దరి చేర్చిన వాలంటీర్స్ ఉద్యోగంలో మేమెంతో సేవ చేసామని సంతృప్తి మాకు కలిగిందని ఈ సదవకాశాన్ని స్థానిక నాయకత్వం మాకు అందజేయడంతో ప్రభుత్వంలో మంచి చేసే అవకాశాన్ని మా కల్పించినందుకు స్థానిక నాయకత్వానికి ఎమ్మెల్యే దుద్దు కుంట శ్రీధర్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు.