టిడిపి జనసేన బిజెపి పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్

టిడిపి జనసేన బిజెపి పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్

అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండల, కేంద్రంలో ఆర్డిటి స్కూల్ ఆవరణంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు తెలుగుదేశం బిజెపి జనసేన కూటమికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈనెల 8 తేదీన గుంటూరులో జరగబోవు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగును.ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ తాడపత్రి నియోజకవర్గం అసెంబ్లీ  ఎన్ డి ఏ కూటమి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డికి నియోజవర్గంలో ఉన్న మాదిగలు మాదిగ ఉపకులాలు టిడిపి పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతూ మహాజన నేత మాన్య శ్రీ మందా కృష్ణ మాదిగ గారి ఆదేశం ప్రకారం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకు మద్దతు ఇవ్వాలని విషయాన్నికొస్తే గతంలో నారా చంద్రబాబునాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ అమలుపరిచి మాదిగల భవిష్యత్తుకు నాంది పలికినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ కొందరు స్వార్ధపరులు సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు అధికారములోకి వచ్చిన పాలకులు మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చేసే విషయంలో శ్రద్ధ చూపడం లేదు. మరియు ముఖ్యంగాఎస్సీ కార్పొరేషన్ విభజించినప్పటికీ రుణాలు మంజూరు చేసిన పాపాన పోలేదు దళితులపైన దాడులు అత్యాచారాలు మానభంగాలు జరిగిన పట్టించుకునే పాపన పోలేదు ఈ ముఖ్యమంత్రి ఈ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లో మాదిగలను అణగదొక్కడేమోతప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఇకనైనా యావత్ మాదిగ జాతి గమనించి ఎన్డీఏ కూటమికి ఓటు రూపంలో మద్దతుగా నిలవాలని ఎన్డీఏ కూటమినే విజయవంతంగా గెలిపి ఎస్సీ వర్గీకరణవర్గీకరణ సాధించుకున్న రోజే నిజమైన ఉగాది పండుగని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి గుడిస భూపతి మాదిగ పెద్దవడుగూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గూడూరు రంగస్వామి మాదిగ మహేష్ మాదిగ పవన్ యువరాజ్ సూరి వేణు సంతోష్ శివరాం మహేష్ హేమంత్ రాఖి లింగన్న నాగరాజు సందీప్ తదితరులు పాల్గొన్నారు.