పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి
పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.(పుట్లూరు జనచైతన్య న్యూస్) పుట్లూరు మండల కేంద్రంలో ఈనెల మార్చి 17వ తేదీ నుండి ప్రారంభమైన పదోతరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారం ముగియడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. గత వారం రోజులుగా స్థానిక మండల జడ్పీహెచ్ స్కూల్, ఏపీ మోడల్ స్కూల్, నందు దాదాపుగా మొత్తం 400 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అదేవిధంగా చివరి పరీక్ష కావడంతో విద్యార్థులు మండల కేంద్రాల నుంచి ఆనందంగా బయటకొచ్చి సంతోషంగా ఎగిరి గంతులేశారు. పరీక్షలు బాగా రాశామని స్నేహితులతో మాట్లాడుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు.గత వారం రోజులుగా ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నేడు పదోతరగతి పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. అనంతరం విద్యార్థులందరూ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడ్కోలు చెప్పుకుని తమ ఇండ్లకు వెళ్ళిపోయారు.