జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించిన ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ*
*ఎన్నికల ప్రచార రథాల ప్రారంభం*
* *జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించిన ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ*
* *అభ్యర్థి నీలం మధుకు విజయ తిలకం దిద్ది ప్రచార శంఖారావం* *పూరించిన మంత్రి కొండా సురేఖ.*
* *పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ శాసన సభ్యులు మైనంపల్లి హనుమంత* *రావు, tsiic చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్*
(జన చైతన్య న్యూస్ సంగారెడ్డి ప్రతినిధి) ఏప్రిల్ 12
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమం పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు లతో కలిసి జెండా ఊపి ప్రచార రహదాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎలక్షన్స్ పటాన్చెరు కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్, దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకన్న, పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మునిసిపల్, పట్టణ, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
*దేవస్థానంలో ప్రత్యేక పూజలు*
ప్రచార రధ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల జగ్గారెడ్డి, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు గణేష్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకన్న, సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, పీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు లకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, సన్నాయి మేళాలతో దేవస్థానంలోకి ఆహ్వానించారు. వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవస్థానం కమిటీ శాలువాలతో నేతలను సన్మానించారు.