తనకల్లు ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్ లేక ఇబ్బందులు పడుతున్న పిల్లలు, పట్టించుకోని అధికారులు
తనకల్లు ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్ లేక ఇబ్బందులు పడుతున్న పిల్లలు, పట్టించుకోని అధికారులు
జనచైతన్య న్యూస్-తనకల్లు
సత్యసాయి జిల్లా తనకల్లు మండలం తనకల్లు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక సరైన హెడ్మాస్టర్ లేక ఇబ్బందులు పడుతున్న చదువుతున్న పిల్లలు, తనకల్లు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక పిఈటి లేక చదువుకోవడానికి టీచర్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు చెప్పుకొచ్చారు. ఇలా అయితే మా చదువులు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్లో చేరితే మాకు మా తల్లిదండ్రులకి కష్టం తగ్గుతుందని గవర్నమెంట్ స్కూల్ కి వస్తే ఇక్కడ టీచర్లు లేరు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎలాగైనా సరే మా స్కూల్ కి టీచర్లు పీఈటి ఎవరు లేరు, ఏ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మా స్కూల్లో క్లీన్ గా ఉండదు నీళ్లు లేవు, స్కూల్లో పనిచేసే వాళ్లు సరిగ్గా పని చేయక ఒక్కొక్కసారి మేమే క్లీన్ చేసుకుంటామని పిల్లలు తెలిపారు.