కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది

*అనంతపురం జిల్లా కనేకల్*

*కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో రంజాన్ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది గురువారం సాయంత్రం నమాజు చదివేందుకు మసీదుకు వెళ్లిన టిప్పర్ డ్రైవర్ లాల్ బాషా(32) విద్యుత్ షాక్ తో మృతి చెందారు నమాజు చదువుకునే ముందు వజూ (కాళ్లు చేతులు శుభ్రం చేసుకునేందుకు) నీళ్లు తీసుకుంటుండగా నీటి తొట్టిలో విద్యుత్ వైర్ తెగి పడింది* 

*ఈ విషయాన్ని లాల్ బాషా గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది స్థానికులు వెంటనే ఉరవకొండలోనీ  ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు   చికిత్స* *పొందుతూ లాల్ బాషా మృతి చెందాడు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అధికారులు స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు*

*మృతి చెందిన భాష రంజాన్ మాసం ఆరంభం నుంచి తన విధులకు సెలవు పెట్టి ఉపవాసాలు ఉంటూ ఐదు పూటల నమాజ్ చేస్తూ ఉన్నారాని స్థానికులు తెలిపారు*