ఎన్నికలు సజావుగా సాగేలా భద్రతా దళాలు కవాతు

ఎన్నికలు సజావుగా సాగేలా భద్రతా దళాలు కవాతు
అమడుగూరు ,ఏప్రిల్10 : జన చైతన్య న్యూస్ :మండల కేంద్రంలో సాయుధ బలగాలతో డప్పు వాయిద్యాల నడుమ పట్టణంలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనియా ఘటనలు జరగకుండా సార్వత్రిక ఎన్నికలు జరిగే విధంగా ప్రజలందరూ సహకరించాలన్నారు ప్రతి ఒక్కరూ మీ విలువైన ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలా దానికి పోలీసు యంత్రాంగ సహకారం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అమడుగూరు ఎస్సై మక్బూల్ బాషా, ఓడిసి ఎస్సై వంశీకృష్ణ, నల్లమాడ ఎస్ఐ రమేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.