శ్రీ డా.B.R అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు.నివాళులు అర్పించారు.
ఈరోజు భారతరత్న శ్రీ డా.B.R అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా కదిరి లో కాంగ్రెస్ కార్యకర్తలు.నివాళులు.
సత్యసాయి జిల్లా. కదిరి. పట్టణం డా.B.R అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు కదిరప్ప ఆద్వర్యంలో కదిరి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ హాజరై ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం నచ్చు బాలకృష్ణ యాదవ్
మాట్లాడుతూ బడుగు బలహీనర్గాల వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచమేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే లాగా *ఓటు* అనే ఆయుధాన్ని ప్రజలకు అందించి, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన *ప్రజాపాలన* కోసం ఒక రూపకల్పన చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి ,భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా నిలిపిన న్యాయశాస్త్ర కోవిదుడు, *భారతరత్న డా.B.R అంబేద్కర్* గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని గుర్తు చేసుకుంటున్నాము అని తెలియజేసారు