రాష్ట్ర అభివృద్ధి వైసిపి తోనే సాధ్యం
రాష్ట్ర అభివృద్ధి వైసిపి తోనే సాధ్యం
సత్యసాయి జిల్లా :అమడగూరు : జన చైతన్య న్యూస్ ఏప్రిల్ 11: అమడగూరు మండల కేంద్రంలోని జే. కే.పల్లి పంచాయితీ పరిధిలోని,కందుకూరుపల్లి,తనకంటి వారి పల్లి,హరిపురం,గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి.గ్రామంలో గడపగడపకు తిరుగుతూ నియోజకవర్గంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధిని జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ .ప్రతిపక్షాలు గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు.ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమాన్ని చేర్చిన సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలని,ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జగనన్నను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ని అత్యధిక మెజారితో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి,శివశంకర్ రెడ్డి,గజ్జల ప్రసాద్ రెడ్డి,తనకంటి జయప్ప,బాబ్జాన్,శ్రీకాంత్,మండలసర్పంచులు ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,కార్యకర్తలు,అభిమానులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు