పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్*

పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్*

*పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్* 

 *ఓడి చెరువు మండలం లో తుమ్మలకుంట్ల పల్లి వైసీపీ సర్పంచ్ తో పాటు పలు వాలంటీర్లు 150 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపి తీర్థం.* 

 *మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరిక* 

 *చంద్రబాబు సూపర్ సిక్స్ తో మేలు చేకూరుతుందని భావించే తెదేపాలోకి చేరాం.* 

 *వైసీపీ సర్పంచ్ శ్రీదేవి* 

 *ఓడి చెరువు:13* 

పుట్టపర్తి నియోజకవర్గం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

 ఓడి చెరువు మండలం తుమ్మలకుంట్లపల్లి గ్రామపంచాయతీ వైసీపీ సర్పంచ్ వేలమద్ది శ్రీదేవి ,రవీంద్రనాయుడు సమక్షంలో వైసీపీ వాలంటీర్లు తోపాటు 150 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి .

శనివారం టీకుంట్లపల్లిలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టిడిపి కండువా కప్పుకుని తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఎంతో మేలు చేకూరుతుందని భావించి అలాగే పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని భావించి తెదేపాలోకి చేరినట్లు సర్పంచ్ శ్రీదేవి ,వైసీపీ నేత రవీందర్ నాయుడు తెలిపారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు .ప్రజలకు అనేక అభివృద్ది పనులు చేస్తామని హామీని ఇచ్చామని వాటిని నెరవేర్చలేకపోయినందుకు ప్రజలు క్షేమించాలని కోరుతూ ,ఈ ప్రభుత్వంతో న్యాయం జరగదని భావించే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరినట్లు వారు పేర్కొన్నారు.

చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు ఎక్కడ చూసినా ప్రజలు టిడిపిని ఆదరించి  నీరాజనాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. పుట్టపర్తి గడ్డపై తెదేపా జెండా ఎగరాలంటే మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ,పుట్టపర్తి నియోజకవర్గ  టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని,హిందూపురం  పార్లమెంటు టిడిపి అభ్యర్థి పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

 *పుట్టపర్తి ప్రశాంతంగా ఉండాలంటే పల్లె సింధూరరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని* *మాజీ మంత్రి పల్లె ప్రజలను అభ్యర్థించారు .* 

అవినీతి అరాచక దౌర్జన్యాలు వేధింపులు పోవాలంటే *వైసీపీ అభ్యర్థి దుద్దే కుంట శ్రీధర్ రెడ్డిని*  ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని అయన కోరారు.

నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూ దందాలు కమిషన్లు దండుకొని ప్రజల రక్తం తాగాడని పేర్కొన్నారు. ఈ అవినీతి ఎమ్మెల్యేను అతి త్వరలో ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విడిచి వైసిపి దుర్మార్గ పాలనకు అంతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 *వైసిపికి చేరిన వారిలో

టికుంటపల్లి పంచాయతీకి చెందిన* 

 

 లక్ష్మీనరసింనాయుడు ,సుధాకర్ నాయుడు, బుట్టి రాము ,మనోరంజని, వేలమద్ది చిన్న రంగప్ప ,రాజప్ప, ఎర్రమనేని చంద్ర ,బీరేఅశోక్, ఎర్రమనేని చంద్రమౌళి, ఉషారాణి ,సాంబమూర్తి, నారే వెంకటేశు ,నారే శివశంకర్ , యార్రమనేనీ శంకర, ఎర్రమనేని సురేష్ ,ఈశ్వరయ్య ,నాగముని ,నాగమునిమ్మ జయమ్మ ,శాంతమ్మ రాజేంద్ర, బాబు, పటాన్ మహబూబ్ బాషా, తాటి మేకలపల్లి బాబా, ఎర్రనేని బుజ్జి, వేలమద్ది రమేష్ నాయుడు ,వేల మద్ది రాజగోపాల్ ,పి సలీం భాష ఎరమినేని వెంకటరమణ, తో పాటు పలువురు పలు కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలోకి చేరారు .

ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర ,మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబుల్ రెడ్డి ,టిడిపి ,జన సేన ,బీజీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.