నవోదయలో విజయదుందబి మ్రోగించిన శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్

నవోదయలో విజయదుందబి మ్రోగించిన శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్

*నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో విజయదుందుభి మ్రోగించిన  శ్రీ జ్ఞానసాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్..

స్థానిక ఒడిసి మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సాయి విద్యానికేతన్  ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు ప్రకటించిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలలో  విజయడంక మ్రోగించింది. ఐదవ తరగతి చదువుతున్న  విద్యార్థులకు అకాడమిక్ సిలబస్ తో పాటు,  సైనిక్ స్కూల్ మరియు నవోదయ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సిలబస్ ను కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించి  శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిక్షణ తీసుకున్న 10 మంది విద్యార్థులలో బి ఖ్యాతి రెడ్డి మరియు జి శృతి కీర్తన అనే ఇద్దరు విద్యార్థులు అర్హత సాధించారని కరస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి  తెలిపారు. కరస్పాండెంట్ క్రిష్ణమోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం  మరియు తల్లిదండ్రులు, పుర ప్రముఖులు అభినందించారు.