మెదక్ ఎంపీ స్థానానికి...* *గజ్వేల్ నుంచి ప్రచార శంఖారావం*

మెదక్ ఎంపీ స్థానానికి...*    *గజ్వేల్ నుంచి  ప్రచార శంఖారావం*

*మెదక్ ఎంపీ స్థానానికి...* 

 *గజ్వేల్ నుంచి  ప్రచార శంఖారావం* 

 *ప్రజ్ఞాపూర్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ* 

 

* *మంత్రి కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే* *మైనంపల్లి హనుమంత రావు గార్లకు అపూర్వ* *స్వాగతం పలికిన గజ్వేల్ ప్రజలు.* 

* *మొదటిసారి అభ్యర్థి నీలం మధు గజ్వేల్ కు* *రాకతో బాణాసంచా కాల్చి  స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు* 

* *పాల్గొన్న సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు మాజీ* *ఎమ్మెల్యే గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ నర్సారెడ్డి, సంగారెడ్డి* డీసీసీ అధ్యక్షులు tsiic చైర్మన్ నిర్మల* జగ్గారెడ్డి,నర్సాపూర్ నియోజికవర్గ ఇంచార్జ్ రాజీ రెడ్డి, దుబ్బాక ఇంచార్జ్ శ్రీనివాస్* *రెడ్డి,మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్  తదితరులు* 

బీసీ బిడ్డ నీలం మధును 

భారీ మెజారిటీతో గెలిపించండి మంత్రి కొండా సురేఖ* 

(జన చైతన్య న్యూస్ సంగారెడ్డి ప్రతినిధి)

ఏప్రిల్ 12

 

పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా మెదక్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రచారానికి శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్- హరిత హోటల్ నుంచి శోభ గార్డెన్ వరకు కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో కలిసి అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ, మైనంపల్లి హనుమంతరావు ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు.  మొదటిసారి ఎంపీ అభ్యర్థి నీలం మధు గజ్వేల్ కు రావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  రోడ్డు పొడవున బాణాసంచా కాల్చి జై నీలం మధు.. కాంగ్రెస్ నినాదాలు ఇచ్చారు. మంత్రి సురేఖ  ఓపెన్ టాప్ జీబ్ లో అభ్యర్థితో కలిసి మంత్రి  ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున వాహనాలతో  పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.