ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పల్లె రఘునాథ్ రెడ్డి

శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం : పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి గారు, పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి గారు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పత్తి చంద్రశేఖర్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అభివృద్ధి బాటలో నడవాలంటే, పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే, ఉద్యోగస్తులకు ఒకటో తారీకు జీతాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని అందుకుగాను ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు.