రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకి ఆర్బికే లలో వేరుశనగ విత్తన పంపిణీ
మండల వ్యాప్తంగా ఆర్బికేలలో విత్తన వేరుశనగ పంపిణీ:-
అమడగూరు వజ్ర భారతి మే 29:- ఖరీఫ్ సీజన్లో వేరుశనగ సాగు చేసే రైతులకి ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తున్న వేరుశెనగ విత్తనాన్ని ఆయా ఆర్బికే కేంద్రాలలో పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటరమణాచారి పేర్కొన్నారు.బుధవారం మండల వ్యాప్తంగా అన్ని ఆర్బికే కేంద్రాలలో సిబ్బంది రైతాంగానికి కే 6 రకం విత్తన వేరుశనగ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 250 మంది రైతులకు 225 క్వింటాల వేరుశనగ పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ సత్యనారాయణ,ఈవోఆర్డి నసీమా,అగ్రికల్చర్ అసిస్టెంట్ పవన్, ఆర్బికే సిబ్బంది,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.