విజయవాడ హైటెక్ వ్యభిచారం స్పా బ్యూటీ పార్లర్ల్
విజయవాడలో హైటెక్ వ్యభిచారం- స్పా సెంటర్లు, ఓయో హోటల్స్ లో దందా
విజయవాడ _ జన చైతన్య (తమ్మిన గంగాధర్)
వ్యభిచారం చేయడానికి అనర్హం అన్నట్టుగా తయారైంది. రాష్ట్రంలో పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ నగరంలో హైటెక్ వ్యభిచార ముఠాలు ఇబ్బడి ముబ్బడిగా వ్యభిచార దందాను నిర్వహిస్తున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యభిచార దందా నిర్వహించటానికి యధేచ్చగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు పోలీసులకు పట్టు బడకుండా తమ వ్యభిచార సామ్రాజ్యాన్ని అనేక చోట్ల విస్తరిస్తున్నారు. దేశం నలుమూలల నుండి మహిళలను రప్పించి వ్యభిచార దందా ఈ దందా వివరాల్లోకి వెళితే. విజయవాడ లో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల నుండి యువతులను ట్రాప్ చేసి, వారిని విజయవాడ కు రప్పించి ఓయో రూములను బుక్ చేసి ఎవరికి పట్టు పడకుండా స్పా సెంటర్ లలో, ఓయో రూములలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఓయో రూమ్స్ బుక్ చేసి వ్యభిచార దందా వాట్సప్ ద్వారా యువతల ఫోటోలను విఠలకు పంపి వల విసురుతున్నారు. మొత్తం ఆన్లైన్ లోనే జరుగుతున్న ఈ బేరసారాల దందాలో ఫైనల్ గా వ్యభిచారం మాత్రం నగరవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్న ఓయో రూములను బుక్ చేసుకుని నిర్వహిస్తున్నారు. స్కోక్కా. ఇన్, లోకాంటో, వివా స్ట్రీట్ తదితర వెబ్సైట్లను ఉపయోగించి విజయవాడ కేంద్రంగా ఈ హైటెక్ వ్యభిచారాన్ని వీరు నిర్వహిస్తున్నారు.