పుట్టపర్తి గడ్డపై టిడిపి జెండా ఎగరేసి చరిత్ర తిరగరాద్దాం పల్లె సిందూరరెడ్డి
పుట్టపర్తి గడ్డపై టీడీపీ జెండా ఎగరేసి చరిత్ర తిరగరాద్దాం పల్లె సిందూరరెడ్డి :
సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువు మే (జనచైతన్య న్యూస్) మండల కేంద్రంలోని కొండకమార్ల పంచాయితీ లోని పలు గ్రామాలలో పుట్టపర్తి నియోజకవర్గ ఎన్.డి.ఏ.కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సిందూరరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, గ్రామ ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు, సిందూరమ్మ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుంపటి చేసింది పుట్టే బిడ్డ పైన కూడా అప్పు మోపింది, ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ మనదగ్గరనుండే ముక్కుపిండి వసూలు చేసింది వైసీపీ ప్రభుత్వం,ఆ అప్పులు తీరాలన్న రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్న, కియా లాంటి పరిశ్రమలు రావాలన్న టీడీపీ ప్రభుత్వం రావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు భావితరాల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు ని ముఖ్యమంత్రి గా, పల్లె సిందూరమ్మని ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ పత్తి చంద్రశేఖర్,మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,ఎద్దుల ప్రమోద్ కుమార్ రెడ్డి,జాకీర్,ఎస్.సీ, సెల్ నాయకుడు రామాంజినేయులు, బి. సీ.సెల్ నాయకులు అంజినప్ప, జనసేన మండల కన్వీనర్ మేకల ఈశ్వర్, బీజేపీ నాయకులు రంగారెడ్డి, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు