త్రాగునీటి ట్యాంకులోకి బూడిద నీరు

త్రాగునీటి    ట్యాంకులోకి   బూడిద   నీరు

తాగునీటి ట్యాంకుల లోకి బూడిద నీరు వదలడం ఎంతటి దుశ్చర్య అర్థం చేసుకోవాలి. 

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

ఉద్దేశ పూర్వకంగా జరుగుతుందా లేక ఇంకా ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనేది సమగ్ర విచారణ జరగాలి. నీళ్ళు లేక తాగునీరు సరఫరా లేక ప్రజలు నాన అవస్థలు పడుతుంటే చోద్యం చూస్తున్న అధికార యంత్రాగం. బూడిద నీరు వదిలి వాటర్ ఫిల్టర్ బెడ్ల ద్వంసం అయితే వాటి మరమత్తులు ఖర్చులు మళ్ళీ ప్రజల మీద రుద్దడమే అవుతుంది. ఇష్టా రాజ్యాంగ ప్రజల నోట్లో బూడిద కొడుతున్న డాక్టర్ ఎన్టీ టి టి పీస్ యాజమాన్యం ఇప్పుడు మరింత బరితెగించి తాగు నీటిని కలుషితం చేస్తున్నారు అంటే జిల్లా అధికారులు, ప్రభుత్వం ఏమి చేయలేదు అనే దురంహకారం కనిపిస్తుంది.  నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఇప్పటికైన స్పందించ కుంటే భవిష్యత్ లో మరింత దురాగతాలకు అవకాశం లేకపోలేదు. మైలవరం