ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్
Obuladevaracheruvu Jana chaithanya news

ఓబులదేవర చెరువు జన చైతన్య న్యూస్ జూన్ 08
రైతులకు నాణ్యమైన విత్తన వేరుశెనగ కాయలు సరఫరా చేయండి
విత్తన కాయల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు
వ్యవసాయ అధికారులకు సూచించిన పుట్టపర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
ఈసారి తొలకరి వర్షాలు సకాలంలో బాగా కురిశాయి
విత్తన సాగుకు ఇదే మంచి సమయం
ప్రతి రైతు సకాలంలో పంటలు సాగుచేయండి.
రైతు సంక్షేమమే చంద్రన్న ప్రభుత్వ ధ్యేయం
*పుట్టపర్తి :08*
నాణ్యమైన విత్తన వేరుశనగ కాయలను అర్హులైన రైతులందరికి సరఫరా చేయాలని పుట్టపర్తి నియోజకవర్గం నూతన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు
పుట్టపర్తి నియోజకవర్గంలో రైతులకు పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ కాయల సరఫరా పై ఆమె శుక్రవారం విజయవాడ నుంచి వ్యవసాయ అధికారులతో ఫోన్ లో వివరాలు అడిగి తెలుసుకున్నారు విత్తన కాయల సరఫరా పై ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 19045 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు కేటాయించినట్లు తెలిపారు
ఇందులో అమడ గూరు మండలానికి 3864 క్వింటాళ్లుఓడి చెరువు మండలానికి 4567 క్వింటాళ్లు నల్లమాడ మండలానికి 5089 క్వింటాళ్లు బుక్కపట్నం మండలానికి 1483 క్వింటాళ్లు కొత్తచెరువు మండలానికి 1576 క్వింటాళ్లు, పుట్టపర్తి మండలానికి 1776 క్వింటాళ్లు కేటాయింపు చేసినట్లు తెలిపారు.అదే విధంగా ఓడి చెరువు మండలంలోని తంగేడు కుంట పంచాయతీలోనీ శోత్రీయం భూముల రైతులకు అదనంగా 690 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు కేటాయింపు చేసినట్లు వెల్లడించారు ఈ శోత్రియం భూములు కలిగిన రైతులు ఇప్పటికే పట్టాదార్ పాస్ పుస్తకం కలిగి ఉండి వ్యవసాయ ప్రభుత్వ యాప్ లో ఆర్బీకే కేంద్రాల్లో ఇప్పటికే విత్తన కాయల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ విత్తన వేరుశనక్కాయలు ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఇంకా పట్టాదార్ పాస్ పుస్తకం లేని అలాంటి రైతులకు ఆఫ్ లైన్ ద్వారా అధికారులు నమోదు చేసుకొని ఆ రైతులందరికీ విత్తన వేరుశెనక్కాయలు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి భరోసా ఇచ్చారు
విత్తన కాయలు లేవని రైతులెవరూ అధైర్యపడవద్దని ప్రతి ఒక్కరికీ అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆమె పేర్కొన్నారు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అండగా ఉంటారని ఆమె రైతులకు భరోసా ఇచ్చారు ప్రస్తుతం జిల్లాలో తొలకరి వర్షాలు బాగా కురుస్తున్నాయని వ్యవసాయ పంటలు సాగు చేయడానికి ఇదే మంచి సమయమని రైతులకు సూచించారు ప్రతి రైతు సకాలంలో పంటలు సాగు చేసుకొనేలా సిద్ధం కావాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతాంగానికి పిలుపనిచ్చారు