బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి ఆధ్వర్యంలో సదాశివపేట మండలం పొట్టి పల్లి గ్రామంలో రైతు రచ్చబండ
బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి ఆధ్వర్యంలో సదాశివపేట మండలం పొట్టి పల్లి గ్రామంలో రైతు రచ్చబండ
జన చైతన్య న్యూస్- సదాశివపేట
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం సదాశివపేట మండలం లోని పొట్టి పల్లి గ్రామంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీ గోదావరి అంజిరెడ్డి ఆదేశాల మేరకు సదాశివపేట మండలలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రబారి ప్రేమేందర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం జరిగింది,ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజేశ్వర దేశ్ పాండే జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ రాజు గౌడ్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులు కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు, జిల్లా నాయకులు సుభాష్ రెడ్డి, విజేందర్ రెడ్డి,గొల్ల భాస్కర్ రావడం జరిగింది.మండలం నుండి వచ్చిన రైతుల సమక్షంలో ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన హామీలు రైతులకు కన్నీళ్లు మిగుల్చే తట్టు చేస్తుంది. రైతులకు రుణ మాపి చేస్తుంది.అని చెప్పి రైతుకు సగం మందికి పైగా రుణాలు మాపి కాలేదు, బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని గ్రామం లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తాం,రైతుల సమస్యల పై బీజేపీ అండగా ఉంటుంది.అని వారు అన్నారు,అన్ని గ్రామం లోనీ రైతులకు సంతకాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకోని వచ్చి రైతులకు న్యాయం జరిగేదాకా బీజేపీ పోరాటం చేస్తుంది అని అన్నారు.