మాన్య మందకృష్ణ మాదిగ ఆదేశం మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ
మాన్య మందకృష్ణ మాదిగ ఆదేశం మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ
జనచైతన్య న్యూస్-పెద్దవడుగూరు
అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలో మాన్య మందకృష్ణ మాదిగ ఆదేశం మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతుగా తాడపత్రి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి ని బారీ మెజారిటీతో గెలిపించుకుందాం, ఎన్డీఏ కోటిని గెలుపు మాదిగల గెలుపు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. ఎస్సీ వర్గీకరణ సాధించుకుందాం, ఎస్సీ వర్గీకరణ 3 సంవత్సరాల మాదిగల కోరిక, ముఖ్యఅతిథిగా పాల్గొన్న వారు పెద్దపప్పూరు టి ఆదినారాయణ మాదిగ అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఏం పెద్దిరాజు మాదిగ ఎమ్మెస్సీ తాడపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ , సిబి రవి మాదిగ ఎమ్మార్పీఎస్ తాడిపత్రి నియోజకవర్గం ఇంచార్జ్, రామాంజనేయులు మాదిగ ఎమ్మార్పీఎస్ తాడిపత్రి టౌన్ అధ్యక్షుడు, పెద్దవడుగూరు మండలం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భూపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కొండయ్య మాదిగ, అనంతపురం జిల్లా కార్యదర్శి గూడూరు రంగస్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ పెద్దవడుగూరు మండల అధ్యక్షుడు అంజి మాదిగ,పెద్దవడుగూరు మండల ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో జరిగినది. ఎమ్మార్పీఎస్ దండోరా ఉద్యమం మొదలుకొని 30 సంవత్సరాల కావస్తున్న మాదిగల అభివృద్ధి కోసం విద్యా రాజకీయాన్ని రంగాలలో మాదిగలు ఎదగాలని జాతి కోసం ఎంతోమంది మాదిగల ప్రాణ త్యాగం చేయడం జరిగినది. 1998లో ఎస్సీ వర్గీకరణ కోసం మాన్య మందకృష్ణ మాదిగ హైదరాబాదులో అమరాన నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది, ప్రభుత్వం నుండి వందనాలు కి ప్రాణహాని ఉందని తాడపత్రి లో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఎర్రగుంటపల్లి తెల్లబల్ల మాదిగ వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని తన త్యాగం చేయడం జరిగింది, తాడపత్రి నియోజకవర్గంలోని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎస్సీ వర్గీకరణ కోసం జాతి కోసం జైలులో నెలల తరబడి ఉండడం జరిగినది, ఇలా చెప్పుకుంటూ పోతే జాతి కోసం ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగం చేయడం జరిగినది, 1999 నుండి 2004 వరకు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణ జరిగినది, అప్పుడు మాదిగలకు వచ్చిన ఉద్యోగాలు 225 ఉద్యోగాలు వచ్చాయి, మాదిగల విద్యారంగంలో రాజకీయ రంగంలో అభివృద్ధి అన్ని విధాలుగా మాదిగలో ఎదగడం జరిగినది, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మాదిగలకు హామీ ఇవ్వడం జరిగింది, ఢిల్లీలో సుప్రీంకోర్టు 7 మంది జడ్జిల్లా న్యాయమూర్తుల ద్వారా జస్టిస్ చంద్ర చూడు నాయకత్వంలో వాదన జరిగినది. అప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాయర్లు పెట్టి వాదించడం జరిగింది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లాయర్ ను పెట్టలేదు, ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపలేదు, మౌనం వహించడం జరిగినది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించి మాదిగనుకు ఒక్క రూపాయి రుణాలు ఇవ్వకుండా మాదిగల అభివృద్ధి లేకుండా మాదిగలకు అన్యాయం చేయడం జరిగినది. కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏసీ వర్గీకరణకు మద్దతు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడం జరిగింది, అందులో భాగంగా అప్పట్లో 5 ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది, ఆ నమ్మకంతో విశ్వాసంతో ఎన్డీఏ కూటమి బిజెపి పార్టీ, తెలుగుదేశం పార్టీ, మాన్య మందకృష్ణ మాదిగ మద్దతు తెలపడం జరిగింది. ఎన్డీఏ కూటమి మద్దతుగా తాడపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం లో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగినది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గెలుపు కోసం గ్రామ గ్రామాలు తిరుగుతూ ఇంటింటికి కరపత్రాలు ఇస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎమ్మార్పీఎస్ నాయకులు వీర మాదిగ, కుమార్ మాదిగ, అప్పేచెర్ల సుధాకర్ మాదిగ, అప్పేచెర్ల ఎద్దులయ్య మాదిగ, సుధా సేన మద్దిలేటి మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.