పవన్ కళ్యాణ్ గెలుపుతో అంబరాన్నంటిన సంబరాలు :-

పవన్ కళ్యాణ్ గెలుపుతో అంబరాన్నంటిన సంబరాలు :-

పవన్ కళ్యాణ్ గెలుపుతో అంబరాన్నంటిన సంబరాలు :-

అమడగూరు జూన్ 04(జనచైతన్య న్యూస్):- సార్వత్రిక ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్బంగా, స్థానిక మండల కేంద్రంలోని జనసైనికులు మంగళవారం సంబరాలు నిర్వహించుకున్నారు.అలాగే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన ప్రతిచోట విజయం సాధించడం పై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ, పుట్టపర్తి నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి విజయంపై హార్షం వ్యక్తం చేస్తూ జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ, జై పల్లె సింధూర రెడ్డి, జై పల్లె రఘునాథ్ రెడ్డి అంటూ హోరింతలతో విజయోత్సవాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పి.అంజి, చిన్నా, స్టూడియో మూర్తి, పూల అంజి, చంద్ర (పండు), అశోక్, పి.మహేష్, యస్.బాబు, కె.మహేష్, శశి, వినయ్, రాజు, చింటు, బబ్లు, నందీష్, పవన్, శివన్న,ముని, తదితరులు జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పల్లె అభిమానులు ఎన్.డి.ఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.