అమడగూరు చౌడేశ్వరి దేవి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు

అమడగూరు చౌడేశ్వరి దేవి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు

అమడగూరు చౌడేశ్వరి దేవి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు:అమడగూరు.ఏప్రిల్.5 ( జన చైతన్య న్యూస్ )

మండల కేంద్రంలోని స్థానిక చౌడేశ్వరి దేవి అమ్మవారి హుండీ ఆదాయం రూ.5,46,360 వచ్చింది.ప్రతి సంవత్సరం అమ్మవారి జ్యోతి ఉత్సవాలను పురష్కరించుకొని హుండి లెక్కింపు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో 16 గ్రామాల ప్రజలు జ్యోతి ఉత్సవాల సమావేశం నిర్వహించారు.అమ్మవారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు.ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు,జరగకుండా పకడ్బందిగా చేయాలని తీర్మానించారు.అనంతరం అమ్మవారి హుండి లెక్కించారు.హుండి ఆదాయాన్ని అమ్మవారి అకౌంట్‌లో జమ చేయనున్నట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు.ఈ కార్యక్రమంలో 16 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

.అమ్మవారి సన్నిధిలో గ్రామ పెద్దలు.