ఘనంగా అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు..

ఘనంగా అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు..

..ఘనంగా అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు..

 (పుట్లూరు జనచైతన్య న్యూస్)..

 పుట్లూరు మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా పుట్లూరు యూత్ వి. రవి ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద అంబేద్కర్ చిత్రపటానికి చిన్న పెద్దలందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం రవి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశపు గొప్ప నాయకులలో ఒకరి  అద్భుతమైన జీవితాన్ని  గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. అదేవిధంగా బాబాసాహెబ్ అని కూడా పిలువబడే డాక్టర్ అంబేద్కర్ గతం నుండి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదు. అతను ఆశను ఇచ్చిన వ్యక్తి బలాన్ని చూపించాడు. అంతేకాకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు మనుషులను డబ్బుతో కొనొచ్చు. కానీ విద్యను కొనలేమని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగిందన్నారు. ఓటుకు నోటు వద్దని మన పిల్లల భావితరాల భవిష్యత్ కోసం ఉపయోగించుకోవాలని అంబేద్కర్  చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలన్నారు.ప్రతి ఒక్కరికీ న్యాయం కోసం పోరాడాడు. ముఖ్యంగా అన్యాయానికి గురైన ప్రజలకు సహాయం చేయడం ద్వారా భారతదేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి నేటికీ జ్ఞాపకంగా జరుపుకుంటున్నామన్నారు.