పోలీస్ బలగాలతో కవాతూ
అనంతపురం :
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
* జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో యాడికిలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు.
జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారి ఆదేశాల మేరకు యాడికి మండల కేంద్రంలో ఈరోజు కేంద్ర సాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ట్రైనీ డీఎస్పీ హేమంత్ కుమార్, బి ఎస్ ఎఫ్ డీఎస్పీ సంతోష్ భట్, యాడికి యు.పి.ఎస్, పెద్దవడగూరు సి.ఐ లు నాగార్జునరెడ్డి, రోషన్ , పెద్దపప్పూరు ఎస్సై శరత్చంద్రల ఆధ్వర్యంలో యాడికి మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్యమైన కాలనీల గుండా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతవరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు.