ఎల్ఈడి డిస్ప్లే బోర్డులు ఐ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా నిషేధం

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఎల్ఈడి డిస్ప్లే సైన్ బోర్డులను పూర్తిగా నిషేధించాలి - ప్రముఖ హైకోర్టు న్యాయవాది పి ఆర్ శేఖర్
విజయవాడ -జన చైతన్య (తమ్మిన గంగాధర్)
ఫిబ్రవరి లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఎల్ఈడి డిస్ప్లే సైన్ బోర్డులను పూర్తిగా నిషేధించాలని ఎల్ఈడి డిస్ప్లే సైన్ బోర్డులను తొలగించి వేయాలని అడ్వకేట్ పిఆర్ శేఖర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఎల్ఈడి డిస్ప్లే సైన్ బోర్డుల వల్ల విలువడే తీవ్రమైన అల్ట్రా వైలెట్ కిరణాల ప్రభావం వల్ల రోడ్లపై వెళ్లే వాహనదారులు ఆప్టికల్ ఇల్యూషన్ సమస్యకు వెంటనే లోనవుతారని దీనివల్ల దేశవ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరిగి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని యువత బార్ అండ్ రెస్టారెంట్లకు పబ్బులకు సైన్ బోర్డుల కారణంగా ఎక్కువగా ఆకర్షితులై దుర్ వ్యసనాలకు బానిసలు అవుతున్నారని దీనిని సైంటిఫిక్ ఆధారాలతో సహా ధ్రువీకరించిన కర్ణాటక హైకోర్టు గత ఫిబ్రవరి నెలలో వచ్చిన తీర్పు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని ల్యాండ్ మార్క్ కేసుగా దేశవ్యాప్తంగా ఎల్ఈడి సైన్ బోర్డులను పూర్తిగా తొలగించి వేయాలని దీనిపై త్వరలో సుప్రీంకోర్టులో పిల్ వేయబోతున్నామని లాయర్ పిఆర్ శేఖర్ తెలిపారు.