దళితులపై దాడిని ఖండించిన సత్య సాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కదిరప్ప
దళితులపై దాడిని ఖండించిన సత్య సాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కదిరప్ప
జనచైతన్య న్యూస్-కదిరి
సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఈ దేశం లోని ప్రజాస్వామ్యం ఎటు వెళ్తోందని ఇటువంటి దాడులు సరైనది కాదని, రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలైన ఇంకా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సత్య సాయి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కదిరప్ప, ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు ఉపేంద్ర మాట్లాడుతూ, రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం పెన్నా పేరూరు గ్రామము దళిత కులానికి చెందిన కదిరి ప్రభాకర్ 55 సంవత్సరాల వయసు గల వ్యక్తి పై రెడ్డి కులానికి చెందిన వారి ఇంటి అరుగుపైన కూర్చున్నాడని కుల దుహంకారం తో వేడి నూనె పోసిన గజ్జల వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్సీల రక్షణ కొరకు ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంకా దళితుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయని అరుగుపైన కూర్చున్నాడని అతడిని కులం పేరుతో దూషించి వేడి నూనె పోయడం చాలా దుర్మార్గమని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాస్టిక్ కేసు నమోదు చేయాలని లేని పక్షాన హోమ్ శాఖకు ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోందన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్, తిప్పన్న, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.