పోలింగ్ స్టేషన్ వద్ద వైసీపీ టీడీపీ వర్గీయుల ఘర్షణ

పోలింగ్ స్టేషన్ వద్ద వైసీపీ టీడీపీ వర్గీయుల ఘర్షణ

పోలింగ్ స్టేషన్ వద్ద వైసీపీ టీడీపీ వర్గీయుల ఘర్షణ :

సత్యసాయి జిల్లా ఓ.డి చెరువు మే(జనచైతన్య న్యూస్)మండల పరిధిలోని కుసుమవారిపల్లి లో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది, టీడీపీ కి చెందిన రంగప్ప మూడు సంవత్సరాలుగా సొంత ఊరిని వదిలి గోరంట్ల లో కాపురం ఉంటున్నాడు,ఓటు వెయ్యడం కోసం సొంతగ్రామం అయిన కుసుమవారిపల్లి కి వచ్చాడు, పాత కక్షలు కారణంగా వైసీపీ పార్టీకి చెందిన ఇంద్రప్ప గొడవకు ప్రేరేపించాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది, కోపంలో రంగప్ప

ఇంద్రప్ప ని కత్తితో పొడిచాడు, స్థానికులు వెంటనే బాధితున్ని ఆసుపత్రికి తరలించారు పోలీసులు రంగప్పని అదుపులోకి తీసుకున్నారు, బాధితుని కుటుంబ సభ్యులు బంధువులు, పోలీస్ స్టేషన్ ని ముట్టడించి దాడి చేసిన వ్యక్తిపైన దాడికి యత్నించారు పోలీసులు వారిని అదుపు చేసి బాధితునికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు, దాడి ఘటనపై దర్యాప్తు చేస్తామన్నారు