ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్న కందికుంట వెంకటప్రసాద్

ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్న కందికుంట వెంకటప్రసాద్

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి

గాండ్లపెంట మండలంలో ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి  కందికుంట వెంకటప్రసాద్

ప్రజలనుంచి అపూర్వమైన స్పందన 

అరాచక ప్రభుత్వంపై విసుగు పోయిన  ప్రజానీకం

ఎన్నికల ప్రచారంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట   వెంకటప్రసాద్ కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం

వాస్తవ పరిస్థితులను ఆలోచిస్తున్న ప్రజలు

జగన్ అంతులేని నిర్లక్ష్యంతో రాష్ట్రం నష్టపోయిందని ప్రజలు ఆలోచిస్తున్నారు

నమ్మి ఓటేసిన ప్రజలు నట్టేట మునిగిపోయారు 

వైసీపీ సొంత పార్టీ కార్యకర్తలే జగన్ పై మండిపడుతున్నారు 

వైసిపి కార్యకర్తలు, ప్రజలను నమ్మే పరిస్థితిలో జగన్ లేడు

వాలంటీర్లను నమ్ముకున్న సైకో జగన్  

నవరత్నాల పేరిట ప్రజలు మోసపోయారు 

వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని మాట మార్చారు 

ఉద్యోగస్తులను అన్యాయం చేశారు

కరోనా సమయంలో ఉపాధ్యాయులతో  బ్రాందీ షాపుల దగ్గర మద్యం అమ్మించారు

అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను రోడ్లపై వేధించారు

జగన్ ను సాగనంపడానికి అన్ని వర్గాల సిద్ధం 

అధోగతిపాలైన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పం అందరిలో ఉంది 

ప్రజల్లో  చైతన్యం వచ్చింది రాష్ట్రంలో  అధికారం మార్పిడి జరగాలని 

 ఎన్నికలలో  వైసీపీ ఘోరంగా ఓడిపోతుంది

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజవర్గంలోని గాండ్లపెంట మండలంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి  కందికుంట  వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. శనివారం గాండ్లపెంట మండలంలోని పోతలవాండ్లపల్లి, పాయకట్టు, గాజులవారిపల్లి, గాజులవారిపల్లి తండా, చామల గొంది, గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ టిడిపి పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చేపట్టబోయే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వివరించారు. కందికుంట ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తున్నది. గత నాలుగు సంవత్సరాల పది నెలల వైసీపీ ప్రభుత్వంలో అవలంబించిన వ్యతిరేక విధానాల పట్ల ప్రజానీకం విసిగిపోయి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. అనంతరం చామాల గొంది లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని గ్రహించిన ప్రజలు ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు పలుకుతున్నారన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలు గ్రహిస్తున్నారని జగన్ అంతులే నిర్లక్ష్యంతో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీకి నమ్మి ఓటు వేసిన ప్రజలు నట్టింట మునిగిపోయారన్నారు. వైసిపి కార్యకర్తలు ,ప్రజలను నమ్మే పరిస్థితిలో జగన్ లేడని సొంత పార్టీ కార్యకర్తలే జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. గత్యంతరం లేక జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను నమ్ముకోవాల్సిన దుస్థితి నెలకుందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నవరత్నాల పేరిట రాష్ట్ర ప్రజలు మోసపోయారన్నారు. వారంలో సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ హామీని విస్మరించారో తెలపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తులను అన్యాయం చేశారన్నారు. కరోనా సమయంలో ఉపాధ్యాయులతో బ్రాందీ షాపుల దగ్గర మద్యం అమ్మించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అంగన్వాడి ,ఆశ కార్యకర్తలను రోడ్డుపైన వేధించారని జగన్ ను సాగనంపడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అధోగతి పాలైన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన సంకల్పం అందరిలో ఉందన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయం అన్నారు.