ఘనంగా సుంకలమ్మ ఆలయ 3 వ వార్షికోత్సవం
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తురకపల్లె గ్రామంలో గల సుంకలమ్మ అమ్మవారి ఆలయ 3 వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాధి పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులతో కుంకుమార్చన చేయించారు. భక్తులు భారీగా హాజరై అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం భజన కార్యక్రమం నిర్వహించారు. చిన్న యక్కలూరు, వెంగన్న పల్లి, నిదనాడు గ్రామలు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.